నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్తో రాకెట్ లాంచ్ చేసిన చైనీస్ స్టూడెంట్స్.. వీడియో వైరల్

నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్తో రాకెట్ లాంచ్ చేసిన చైనీస్ స్టూడెంట్స్.. వీడియో వైరల్

ఇస్రో, నాసా ప్రయోగాలు చూసుంటారు కదా. రాకెట్ లాంచ్ చేయాలంటే ఎంతో ఖర్చు, ఎంతో మంది సైంటిస్టుల శ్రమ, దాదాపు బాంబు పేలినంత బ్లాస్ట్ తో పీడనం అప్లై చేయడం ద్వారా రాకెట్ లాంచ్ అవుతుంది. ఇక్కడ బ్లాస్ట్, మంట ఏదీ లేకుండా కేవలం నీళ్లతో ప్రెజర్ (పీడనం) అప్లై చేసి రాకెట్ లాంచ్ చేశారు చైనా స్టూడెంట్స్. ఇలాంటి ఐడియాస్ వీళ్లకే ఎలా వస్తాయ్.. అన్నట్లుగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చైనాలోని జియాంగ్సి లో.. స్టూడెంట్స్ తో కలిసి రెండు స్టేజ్ లలో లాంచ్ అయ్యే రాకెట్ ను తయారు చేశారు ఒక టీచర్. సాధారణ ప్లాస్టిక్ బాటిల్స్, నీళ్ల సహాయంతో ప్రెజర్ జనరేట్ చేసి రాకెట్ ను నింగిలోకి పంపించారు. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో సైన్స్ ఎడ్యుకేషన్ ను ఎంత ప్రభావవంతంగా చెప్పవచ్చో ఈ టీచర్ చేసి చూపించారు. 

►ALSO READ | భారతీయుడికి రూ.కోటి పరిహారం చెల్లించనున్న లండన్ KFC.. కారణం ఏంటంటే..

రెండు దశల్లో ప్లాస్టిక్ బాటిల్స్ తో రాకెట్ ను తయారు చేశారు. ఒక్కో సెగ్మెంట్ కు బాటిల్స్ ను అమర్చారు. లోపల గాలిని నింపి బాటిల్స్ అసెంబుల్ చేశారు. నీటితో పీడనం డెవలప్ చేశారు. రాకెట్ పనిచేసే విధానం గురించి థియరీ చెప్తూనే.. ప్రాక్టికల్ గా నాలెడ్జ్ వచ్చేలా తయారు చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో టీచర్ ఎక్కువగా స్టూడెంట్స్ తోనే పని పూర్తి చేయించారంట. దీన్ని ఒక సైంటిఫిక్ అచీవ్మెంట్ గా అభినందిస్తున్నారు.