హైదరాబాద్: ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం (డిసెంబర్ 28) నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో కాంగ్రెస్ యువ చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గాంధీలది త్యాగాల కుటుంబమని.. వారిపై కోపంతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో అడ్డంగా దోచుకు తిన్నదని కేసీఆర్ కూతురు కవిత చెప్పిందని.. కూతురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయడంతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి.. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో 45 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
►ALSO READ | ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో ఏర్పాటు నెహ్రూ దూరదృష్టికి నిదర్శనం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
