
అక్టోబర్ లో 5 లక్షల మంది బీసీలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఎన్నికలపై బీసీ కులాలు చర్చించాయి. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా కూడా..ఇంకా బీసీలను బానిసల్లాగా చూస్తున్నారని పలువురు బీసీ నాయకులు అభిప్రాయపడ్డారు. భూముల అమ్ముకుని అయినా..ఎన్నికల్లో పోటీ చేయాలని.. బానిస బతుకుల బతకకూడదన్నారు. రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో 90 శాతం ఓట్లు బీసీలయే ఉన్నాయని చెప్పారు. బీసీలకు సీట్లు ఇవ్వకుంటే అగ్ర కులాల అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు. ఈ చర్చలో భాగంగా బీసీ వర్కింగ్ కమిటీ పలు తీర్మానాలు చేసింది.
బీసీ వర్కింగ్ కమిటీ తీర్మానాలు
- రాబోయే ఎన్నికల్లో బీసీలు ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఓడించాలి.
- రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించాలి.
- కిషన్ రెడ్డి అంబర్ పేట లో ఓడించాలి.
- బిఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది ..కాబట్టి కేసిఆర్ ను గజ్వేల్, కామారెడ్డిలో ఓడించాలి.
- బీసీల సభలను కవర్ చేయకుండా చిన్న చిన్నగా చూస్తున్న వీడియో ఛానల్ ను బీసీలు బహిష్కరించాలి..
- బీసీల సమస్యలు, ఆత్మగౌరవాన్ని కాపాడే మీడియా ఛానల్ లను భుజాలపైన ఎత్తుకోవాలి.
- నీలం మధు పేరును పటాన్చెరువు ప్రజలు గుండెపైన రాసుకున్నారు.
- సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బీసీలు ఓడించాలి.
- అవకాశం వస్తే ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ముదిరాజ్ కులస్తులు కావాలి.
- త్వరలోనే 5 లక్షల మంది బీసీ లతో భారీ బహిరంగ సభ