9,168  గ్రూప్– 4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​

9,168  గ్రూప్– 4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​

గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గ్రూప్ –​ 4  సర్వీసులకు సంబంధించిన 9,168  ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ  పచ్చజెండా ఊపింది. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TSPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు . ఈమేరకు అనుమతి ఇస్తూ  తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 


భర్తీ  చేయనున్న పోస్టుల వివరాలు..

గ్రూప్​ 4 ఉద్యోగాల్లో ప్రధానంగా 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటిలో దాదాపు 6,859 జూనియర్​ అసిస్టెంట్​ పోస్టులు, 1,862  వార్డు ఆఫీసర్​ పోస్టులు, పంచాయతీరాజ్​ శాఖలో 1,245 పోస్టులు, 429 జూనియర్​ అకౌంటెంట్​ పోస్టులు, 18 జూనియర్​ ఆడిటర్​ పోస్టులు ఉన్నాయి.  ఇక రెవెన్యూ శాఖలోనూ 2,077 జూనియర్​ అసిస్టెంట్​ పోస్టులు ఉన్నాయి.