నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గ్రూప్ – 2, 3, 4లో మరిన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్  : గ్రూప్ – 2, 3, 4లో మరిన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ సర్కారు  గ్రూప్-2లో 6, గ్రూప్-3లో 2,  గ్రూప్-4లో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది.  గ్రూప్-2లో ఎన్నికల సంఘం, ASO, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను చేర్చారు.  గ్రూప్-3 లో గిరిజన సంక్షేమ శాఖ అకౌంటెంట్, HODల్లోని అసిస్టెంట్, అకౌంటెంట్ పోస్టులను.. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ పోస్టులను చేర్చారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తున్నామంటున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు..గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ తరువాత మరో వారం నుండి పది రోజుల్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు..ఇప్పటికే గ్రూప్ 3..గ్రూప్ 2 నోటిఫికేషన్ల పై  టీఎస్పీఎస్సీ అధికారులు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు, రోస్టర్  పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తి చేయడంతో నియామకాల ప్రక్రియ శరవేగంగా పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు.