ఏడాదిలో కంప్లీట్ గా పేపర్ లెస్ పాలన..సెక్రటేరియెట్ నుంచి జిల్లాల దాకా ఈ ఆఫీస్ విస్తరణ

ఏడాదిలో కంప్లీట్ గా పేపర్ లెస్ పాలన..సెక్రటేరియెట్ నుంచి జిల్లాల దాకా ఈ ఆఫీస్ విస్తరణ
  • పరిపాలనా యంత్రాంగంలో సర్కారు విప్లవాత్మక మార్పులు
  • సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జిల్లాల దాకా ‘ఈ -ఆఫీస్’ విస్తరణ
  • ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ‘ఈ -కేబినెట్’.. ఉద్యోగులకు ‘హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్’ సేవలు
  • పైరవీలకు తావులేకుండా నేరుగా ఖాతాల్లోకే స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైసలు
  • సీఎంవో పరిధిలో ‘రియల్ టైమ్ కమాండ్ డ్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డు’ ఏర్పాటు

 

హైదరాబాద్, వెలుగు:  పరిపాలనా యంత్రాంగంలో రాష్ట్ర సర్కారు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. రాబోయే ఏడాది కాలంలోనే వంద శాతం పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ పాలనను అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్ గవర్నెన్స్ లక్ష్యంగా రూపొందించిన సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వ శాఖల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలతోపాటు ప్రజలకు అందించే సేవలన్నింటినీ పూర్తిగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పరిధిలోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి క్షేత్రస్థాయి జిల్లా కలెక్టరేట్ల వరకు ఇప్పటికే ‘ఈ -ఆఫీస్’ను విస్తరించడంతోపాటు విధాన నిర్ణయాల కోసం విజయవంతంగా ‘ఈ- కేబినెట్’ను అమలు చేస్తున్నది. ఉద్యోగుల సర్వీసు రికార్డులు, బదిలీలు, పదోన్నతులు, జీతభత్యాల ప్రక్రియను డిజిటలైజ్ చేయడమే కాకుండా.. ప్రజా సంక్షేమ పథకాలను సైతం నూటికి నూరు శాతం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారానే లబ్ధిదారులకు అందించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఫైళ్ల కదలికలో వేగం పెంచి, అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకత తీసుకొస్తున్నది. దీనికితోడు ప్రతి శాఖ పనితీరును, ఫైళ్ల స్టేటస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచే క్షణాల్లో సమీక్షించేలా అత్యాధునిక రియల్ టైమ్ డ్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డును ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. 

ఈ -ఆఫీస్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

డిజిటల్ విప్లవంలో భాగంగా సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని శాఖలు, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీ ఆఫీసులు, క్షేత్రస్థాయి విభాగాలను ఒకే డిజిటల్ చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందకు అనుసంధానించారు.సెక్షన్ క్లర్క్ స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వరకు ఫైళ్లు కాగితాల రూపంలో కదలకుండా కేవలం ఒక్క కంప్యూటర్ క్లిక్‌‌‌‌తో పైఅధికారుల లాగిన్‌‌‌‌కు చేరేలా ఈ -ఆఫీస్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేశారు. దీంతో గతంలో వారాల తరబడి పెండింగ్‌‌‌‌లో పడి దుమ్ముపట్టిన కీలక ఫైళ్లు కొన్ని గంటల వ్యవధిలోనే పరిష్కారమవుతున్నాయి. దస్త్రాల పరిష్కారంలో అనవసర జాప్యానికి చెక్ పెట్టేందుకు ప్రతి టేబుల్ వద్ద స్పష్టమైన గడువును నిర్దేశించారు. నిర్ణీత సమయంలోగా ఫైలుపై సంతకం చేయకపోతే సంబంధిత అధికారిని జవాబుదారీ చేసేలా ఆటోమేటిక్ డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని తెచ్చారు. ఈ సాంకేతికతోప్రభుత్వ ఖజానాపై పడే భారీ కాగితం కొనుగోలు ఖర్చులు, ఫైళ్ల నిర్వహణ భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి ఎంతగానో మేలు చేకూరుతోందని అధికారులు చెబుతున్నారు.

సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ‘ఈ కేబినెట్‌‌‌‌’

రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలకు అత్యంత కీలకమైన మంత్రివర్గ సమావేశాలను సైతం ఎలాంటి కాగితాలు లేకుండా ట్యాబ్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ల ద్వారానే నిర్వహించే ‘ఈ- కేబినెట్’ విధానాన్ని ప్రభుత్వం సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కొనసాగిస్తున్నది. కేబినెట్ ముందుకు వచ్చే వివిధ శాఖల నోట్స్, ప్రతిపాదనలను సైబర్ భద్రతతో ముందస్తుగానే మంత్రుల డిజిటల్ డివైజ్‌‌‌‌లకు పంపుతున్నారు. దీంతో నిర్ణయాలపై మంత్రులు ముందే అధ్యయనం చేసేందుకు వీలు కలగడంతోపాటు ప్రభుత్వ రహస్య సమాచారం బయటకు పొక్కే అవకాశాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడింది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను ‘హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్’ (హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎంఎస్) పోర్టల్‌‌‌‌లోకి తీసుకొచ్చారు. ఉద్యోగుల సెలవు దరఖాస్తులు, పీఎఫ్ విత్‌‌‌‌డ్రావల్స్, వార్షిక నివేదికలు, జీపీఎఫ్ రుణాలు అన్నీ ఆన్‌‌‌‌లైన్ ద్వారానే నిమిషాల్లో ఆమోదం పొందుతున్నాయి. అర్హులకు స్కీమ్స్‌‌‌‌ చేరేలా డిజిటల్‌‌‌‌ వ్యవస్థ
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు 100 % అర్హులైన నిరుపేదలకే చేరేలా లబ్ధిదారుల ఎంపిక నుంచి నగదు బదిలీ (డీబీటీ) వరకు పక్కా డిజిటల్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, రైతు సంక్షేమ సాయంలాంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తుల నమోదు మొదలుకొని క్షేత్రస్థాయి విచారణ వరకు డిజిటల్ ఆధారాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. లబ్ధిదారుల ఆధార్ అనుసంధానంతో బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఏండ్లుగా పాతుకుపోయిన దళారీ వ్యవస్థను, నకిలీ క్లెయిమ్స్‌‌‌‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నది. గతంలో దరఖాస్తుదారులు రశీదులు, ధ్రువీకరణ పత్రాల కోసం మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి రాగా, ప్రస్తుతం మీ-సేవా, ప్రజా సిటిజన్ పోర్టల్ ద్వారా ఇంటినుంచే నిమిషాల వ్యవధిలో నమోదు చేసుకునేలా పాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చారు.

డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌ బలోపేతం

వివిధ శాఖల కీలక సమాచారాన్ని ఒకే వేదికపై పదిలంగా భద్రపరిచేందుకు రాష్ట్ర డేటా సెంటర్‌‌‌‌ను (ఎస్‌‌‌‌డీసీ) అత్యాధునిక మౌలిక వసతులతో సర్కారు మరింత బలోపేతం చేస్తున్నది. ప్రభుత్వ భూముల వివరాలు, ఆస్తుల రికార్డులు, పన్నుల వసూళ్లు, పౌర సేవల ఫైళ్లన్నీ పర్మినెంట్‌‌‌‌ డిజిటల్ రూపంలోకి మారుతున్నాయి. ఈ డేటాను ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా ఉండేందుకు కఠినమైన సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలతోపాటు అత్యాధునిక బ్లాక్‌‌‌‌చెయిన్ టెక్నాలజీని జోడిం చారు. పౌరులు తమకు అవసరమైన ప్రభుత్వ ధ్రువపత్రాలను ఎక్కడి నుంచైనా సులువుగా డౌన్‌‌‌‌లోడ్ చేసుకునేలా ‘డిజిలాకర్’ సౌకర్యాన్ని అనుసంధానించారు. ఈ డిజిటల్ పాలన ప్రక్రియ మొత్తాన్ని సీఎం, మంత్రులు, సీఎస్ తమ చాంబర్లనుంచే ఒకే క్లిక్‌‌‌‌తో సమీక్షించేలా ‘రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ డ్యాష్‌‌‌‌బోర్డు’ను సిద్ధం చేశారు. శాఖలవారీగా నిధుల వ్యయం, ప్రజా సమస్యల పరిష్కార తీరును దీనిద్వారా క్షణాల్లో పర్యవేక్షిస్తూ.. తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ డిజిటల్ గవర్నెన్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యంత్రాంగం కదులుతున్నది.