అమ్మకానికి ఇరిగేషన్‌‌ భూములు

అమ్మకానికి ఇరిగేషన్‌‌ భూములు
  • 150 ఎకరాల వాలంతరి భూములు అమ్మాలని సర్కార్‌‌‌‌ యోచన 

హైదరాబాద్‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ భూములను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 150 ఎకరాల నీరు, భూమి యాజమాన్య, శిక్షణ, పరిశోధన సంస్థ (వాలంతరి) భూములను అమ్మేసి ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నది. ఈ భూముల అమ్మకానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? అమ్మితే ఎంత వస్తుంది? ఆయా భూముల ప్రస్తుత పరిస్థితి ఏంటి? అనే వివరాలపై సర్వే చేస్తున్నది. రాజేంద్రనగర్‌‌ సమీపంలోని కిస్మత్‌‌పురలో 130 ఎకరాలు, ప్రేమావతిపేటలో 39 ఎకరాల భూములు వాలంతరి పేరుతో ఉన్నాయి. ఇందులో 15 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు ఉండగా, అదనంగా మరో 4 ఎకరాలను వాలంతరి అవసరాలకు ఉంచుకొని, మిగతా 150 ఎకరాలు అమ్మేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.