ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ

ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ

హైదరాబాద్, వెలుగు: ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్​రోనాల్డ్​రోస్ ప్రకటించారు. బల్దియా పరిధిలో వన్ టైమ్ సెటిల్​మెంట్(ఓటీఎస్) స్కీమును అమలు చేస్తున్నామని, ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31 వరకు స్కీము అందుబాటులో ఉంటుందని, పెండింగ్​బకాయిలను కేవలం 10 శాతం వడ్డీతో చెల్లించవచ్చని చెప్పారు. అన్ని రకాల ఆస్తి పన్ను బకాయిలకు ఓటీఎస్​వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఆదివారం అన్ని సర్కిల్​ఆఫీసుల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రాపర్టీ ట్యాక్స్​పరిష్కారం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో ఆస్తి పన్నుకు సంబంధించి కోర్టు కేసులు మొదలు అన్ని రకాల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ రెండు అవకాశాలను ఆస్తి పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.