గోర‌టి వెంక‌న్న స‌హ ముగ్గురి ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

V6 Velugu Posted on Nov 13, 2020

హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.రేపే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్ర‌వారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జ‌రిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tagged Telangana Govt, confirms, Governor Quota, three mlc candidates

Latest Videos

Subscribe Now

More News