కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సేవలు కొనసాగింపు..పీఆర్, ఆర్డీలో 12,055 మంది సిబ్బందికి ఊరట

కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సేవలు కొనసాగింపు..పీఆర్, ఆర్డీలో 12,055 మంది సిబ్బందికి ఊరట

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న  12,055 కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి సేవలను 2025 ఏప్రిల్​ 1 నుంచి 2026 మార్చి 31 వరకు కొనసాగించనున్నారు. లేదంటే  పీఆర్​, ఆర్డీ శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల్లో అవసరం ఉన్న వరకు సేవలను వినియోగించుకోనున్నారు.  

ఇందులో 3,717 ఎఫ్​టీలు,  7,385 కాంట్రాక్టు, 900 ఔట్ సోర్సింగ్, 53 గౌరవ వేతన ఉద్యోగులున్నారు. వేతనం, ఖర్చు సంబంధిత కేంద్ర పథకాల నిధుల నుంచి ఎస్ఎన్ఏ స్పర్శ మాడ్యూల్ ద్వారా చెల్లించనున్నది. ఒప్పందాలు నిర్దేశిత నిబంధనలకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం  పేర్కొంది.