చైనాలో ‘పెట్రో’ మంటలు.. బంక్ ల దగ్గర భారీగా క్యూ

చైనాలో ‘పెట్రో’ మంటలు.. బంక్ ల దగ్గర భారీగా క్యూ

టెహ్రాన్: ఖర్గ్ ఐలాండ్‌‌‌‌పై అమెరికా దాడి చేయడంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురును దిగుమతి చేసుకునే చైనాను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ధరలు భారీగా పెరుగుతాయన్న భయంతో చైనాలో పెట్రోల్ బంక్​ల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. 

2024 లెక్కల ప్రకారం ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 91% చైనాకే వెళ్తున్నది. షాన్‌‌‌‌డాంగ్ ప్రావిన్స్‌‌‌‌లోని చిన్న చమురు శుద్ధి కర్మాగారాలు(టీపాట్స్) తక్కువ ధరకు లభించే ఇరాన్ ఆయిల్​పైనే ఆధారపడి నడుస్తున్నాయి. తాజా దాడులతో వీటి మనుగడ ప్రమాదంలో పడింది. దీంతోపాటు 2 వారాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 23న లీటరుకు రూ.99.3 ఉన్న 
ధర, మార్చి నాటికి రూ.109.4కి చేరింది.