లక్సెట్టి పేట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

లక్సెట్టి పేట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేటను అభివృద్ధి చేయడానికి వెనకడుగు వేసేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో ఇటిక్యాల చెరువు వద్ద సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మూడు కోట్ల 14 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉత్కుర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు మధ్యలో నుంచి ఇరువైపులా 40 ఫీట్ల చొప్పున రోడ్డు వెడల్పు చేస్తున్నామని తెలిపారు. 

లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సాధ్యమైనంత మేర అధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి, రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.