V6 News

పదోన్నతుల్లో జీపీవోలకు చోటు..రొటేషన్ పద్ధతి ఖరారు చేస్తూ ఉత్తర్వులు

పదోన్నతుల్లో జీపీవోలకు చోటు..రొటేషన్ పద్ధతి ఖరారు చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ నిబంధనలకు సవరణలు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. జిల్లా స్థాయిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, గ్రామ పాలనా అధికారుల (జీపీవో) మధ్య 60:40 నిష్పత్తిని ఖరారు చేస్తూ 'తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్, 1998ని సవరించింది.

ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 12, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా తెలిపింది. ఈ మేరకు పదోన్నతుల కేటాయింపులో అనుసరించాల్సిన 10 ఖాళీల రొటేషన్ పద్ధతిని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సవరణల ద్వారా రెవెన్యూ శాఖలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లతో పాటు, జూనియర్ అసిస్టెంట్ స్కేలు పొందుతున్న గ్రామా పాలనా అధికారులు కూడా సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు మార్గం సుగమమైంది.