
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సమగ్ర వ్యవసాయ విధానం అమలు కోసం రాష్ట్రంలో 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. రెగ్యులర్ ప్రాతిపదికన అధికారులను నియమించే వరకు క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు రాకుండా వీరిని నియమించడం జరుగుతుందన్నారు.