పొర్లు దండాలు పెట్టినా.. హరీశ్కు బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వరు: బీర్ల ఐలయ్య

పొర్లు దండాలు పెట్టినా..  హరీశ్కు బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వరు: బీర్ల ఐలయ్య

పొర్లు దండాలు పెట్టినా  హరీశ్ రావుకు  బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హరీశ్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారు. పార్టీని కూడా అందులో  విలీనం చేస్తారని ఆరోపించారు. హరీశ్ రావు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్ తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని సూచించారు.  హరీశ్ చిల్లర మాటలు మానకపోతే ప్రజలు ఉరికించి కొడతారని మండిపడ్డారు.  బీఆర్ఎస్ చేసిన పాపాలు కడుక్కోవాలనన్నారు.

మీడియా మూందు మాట్లాడకపోతే తన మామకు అనుమానం వస్తుందని హరీశ్  భయపడుతున్నారని ఐలయ్య అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అయిపోయినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్ గాయబ్ అయ్యారని ఎద్దేవా చేశారు.  ప్రజలు పరువు తీసినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రావడం లేదన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ అవయవదానం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కంటే తమ పాలన బాగుందన్నారు. 
 జూలై 17 నుంచి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఐలయ్య.

రఘనందన్, హరీష్  మధ్య లోపాయికార ఒప్పందం

తమ అడ్డా అని చెప్పుకునే  సిద్దిపేట, సిరిసిల్ల బీఆర్ఎస్  పరిస్థితి ఏమయ్యిందని ప్రశ్నించారు.  రఘనందన్, హరీష్ రావు మధ్య లోపాయికార ఒప్పందం ఉందన్నారు.   అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో హరీష్ రావు నేర్పరని అన్నారు.  రేవంత్ నాయకత్వం బలపడుతుందని భయంతోనే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయని విమర్శించారు.  బీజేపీకి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు తమ క్యాడర్ కి చెప్పారని ఆరోపించారు.