రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 22 న గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష : జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌

 రాష్ట్ర వ్యాప్తంగా  ఫిబ్రవరి  22 న గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష : జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌

మంథని, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22న తెలంగాణ గురుకులాల ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌ బుధవారం తెలిపారు. గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందుకు జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 10 గంటల్లోపు చేరుకోవాలని ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ 11గంటలకు ప్రారంభమవుతుందన్నారు.