గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..ఫేజ్1లో 18,401 సీట్లు భర్తీ

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..ఫేజ్1లో 18,401 సీట్లు భర్తీ

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 – -27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫలితాలను రిలీజ్ చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉండగా, ఫేజ్1 అడ్మిషన్లలో మొత్తం 18,401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇంకా 1,339 సీట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఫేజ్-1లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ వచ్చే నెల 7లోగా రిపోర్ట్ చేయాలని సూచించారు. 

విగ్రహాల ప్రతిష్టలో ఇబ్బందులు పరిష్కరించండి.. 

జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. సెక్రటేరియెట్‌‌‌‌లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విగ్రహాల ప్రతిష్టాపనలో ఇబ్బందులపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి రివ్యూ చేపట్టారు.