నిష్కాకు మూడు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

నిష్కాకు మూడు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ జిమ్నాస్టిక్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ నిష్కా అగర్వాల్‌‌‌‌.. జూనియర్‌‌‌‌ నేషనల్‌‌‌‌ ఆర్టిస్టిక్‌‌‌‌ జిమ్నాస్టిక్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మూడు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో మెరిసింది. ఒడిశాలో శనివారం ముగిసిన జూనియర్‌‌‌‌ గర్ల్స్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ కేటగిరీ, టేబుల్‌‌‌‌ వాల్ట్‌‌‌‌, అన్‌‌‌‌ఈవెన్‌‌‌‌ బార్స్‌‌‌‌లో మూడు స్వర్ణాలు నెగ్గింది. 

ఫ్లోర్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌, బ్యాలెన్సింగ్ బీమ్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను గెలిచింది. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ కేటగిరీలో సౌమిలా కర్కార్‌‌‌‌ (వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌), సారా రావూల్‌‌‌‌ (మహారాష్ట్ర) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. గత వారం ఢిల్లీలో జరిగిన స్కూల్‌‌‌‌ నేషనల్స్‌‌‌‌లో నిష్కా  4 మెడల్స్‌‌‌‌ సాధించింది.