కరోనాపై ఆందోళన వద్దు..ఇది సీజనల్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌టిక్ మాత్రమే..క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ

కరోనాపై ఆందోళన వద్దు..ఇది సీజనల్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌టిక్ మాత్రమే..క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న కేసుల పెరుగుదల కేవలం సీజనల్ అప్‌‌‌‌‌‌‌‌టిక్ మాత్రమేనని వెల్లడించింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్, ఐడీఎస్‌‌‌‌‌‌‌‌పీ, వెల్లూరులోని సీఎంసీ వంటి ప్రముఖ రీసెర్చ్ సంస్థలు దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయన్నారు.

గతేడాది కూడా ఇదే సమయంలో కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించిందని, ప్రస్తుత పెరుగుదల దానికి అనుగుణంగానే ఉందని నిపుణులు తేల్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ తీవ్రత పెరిగినట్లు గానీ, ఆందోళన కలిగించే కొత్త రకం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏదీ పుట్టుకొచ్చినట్లు ఆధారాలు లేవని డీహెచ్ వెల్లడించారు. కానీ కరోనాతో పాటు  జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ ఇన్ ఫ్లూయెంజా వ్యాపిస్తున్న తరుణంలో వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కనీస జాగ్రత్తలు పాటించాలని డీహెచ్ సూచించారు.