హైకోర్టు తొలి మహిళా జడ్జిగా శ్రీదేవి

హైకోర్టు తొలి మహిళా జడ్జిగా శ్రీదేవి

రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌‌ గండికోట శ్రీదేవి బాధ్యతలు చేపట్టారు. ఆమెతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్‌‌ బుధవారం ప్రమాణం చేయించారు. ఏపీలోని విజయనగరానికి చెందిన శ్రీదేవి, ఆలిండియా జ్యుడీషియల్‌‌ సర్వీసెస్‌‌ ద్వారా యూపీ కేడర్‌‌కి ఎంపికయ్యారు. అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాక, తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. ఆమె అభ్యర్థనకు సుప్రీంకోర్టు కొలీజియం అంగీకారం తెలిపింది. ఆపై రాష్ట్రపతి ఆమోదంతో శ్రీదేవి రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రమాణ కార్యక్రమానికి న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌‌లు, న్యాయవాదులు హాజరయ్యారు.