జనగామ అర్బన్, వెలుగు : తెలంగాణ హైకోర్టు జస్టిస్ సురేపల్లి నంద శనివారం జనగామ జిల్లా కోర్టును సందర్శించి న్యాయ పరిపాలన, మౌలిక సదుపాయాలు, కోర్టు నిర్వహణను పరిశీలించారు. ఆమెకు జిల్లా జడ్జి బి.ప్రతిమ, వరంగల్ సీపీ స్వేత, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, బార్ అసోసియేషన్ ప్రతినిధులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని, కోర్టు పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాలని జస్టిస్ సూచించారు. అనంతరం కోర్టు ప్రాంగణం, వివిధ విభాగాల పనితీరు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, రికార్డులను పరిశీలించారు.
సబ్‌జైలును సందర్శించిన జిల్లా జడ్జి..
భద్రాచలం : భద్రాద్రికొత్తగూడెం జిల్లా సెషన్స్ జడ్జి జి. ప్రేమలత శనివారం భద్రాచలం సబ్‌జైలును సందర్శించారు. పరిపాలన, ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలు, మౌళిక, భోజన వసతులు, ఉచిత న్యాయసాయాన్ని పరిశీలించి జైలు సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. జైల్లోని ఖైదీల అగరబత్తి తయారీ విధానాన్ని ఆమె కొనియాడారు. ఓల్డేజ్ హోంను సందర్శించి, పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు భద్రాచలం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్టును
పరిశీలించారు.
