
- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతాదయాకర్‌రెడ్డి నియామకంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నియామక ప్రక్రియపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని మహిళా శిశు సంక్షేమశాఖకు, సీతా దయాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ నల్గొండకు చెందిన చింతా కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చైర్‌పర్సన్ పోస్టుకు తగిన అర్హతలు లేకపోయినా ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాజకీయ నేపథ్యంతో ఈ నియామకం
జరిగిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను వాయిదా వేశారు.