హ్యూమన్‌‌‌‌రైట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఉత్తర్వులను ..నిలిపివేసిన హైకోర్టు

హ్యూమన్‌‌‌‌రైట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఉత్తర్వులను ..నిలిపివేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: స్టేట్‌‌‌‌ హ్యూమన్‌‌‌‌రైట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ తన పరిధిలోకి రాని వివాదాలపై విచారణ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సివిల్, ఫ్యామిలీ వివాదాల్లో ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు ఇది వ్యతిరేకమని తెలిపింది.  ఈ మేరకు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ ఆరాధే, జస్టిస్‌‌‌‌ వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

వేర్వేరు అంశాలపై దాఖలైన పిటిషన్లను డివిజన్​ బెంచ్​ సోమవారం విచారణ చేపట్టింది. భూములు, స్థలాలపై హక్కుల గురించి, భూముల సర్వే చేయాలన్న ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. మెడికల్‌‌‌‌ నెగ్లిజన్సీ కేసులో ఇచ్చిన ఉత్తర్వులు సరికాదని పేర్కొంది. మెడికల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ జోక్యం చేసుకున్న కేసులో కమిషన్‌‌‌‌ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని వెల్లడించింది. మ్యారేజీ బ్రోకరేజీ వ్యవహారంపై ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు నిలిపివేసింది. 

నాగం ఆరోపణలకు ఆధారాలు లేవన్న హైకోర్టు

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ  కాంగ్రెస్‌‌‌‌ నేత నాగం జనార్దన్‌‌‌‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌‌‌ చేసింది. ఎన్నికల సమయంలో మర్రి సమర్పించిన ఎలక్షన్‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌లో పలు విషయాలు చెప్పలేదంటూ నాగం చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌ అనుపమ చక్రవరి సోమవారం జడ్జిమెంట్‌‌‌‌ చెప్పారు. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని   పిటిషన్‌‌‌‌ ను కొట్టివేశారు.