హైదరాబాద్, వెలుగు: ఒకే క్రిమినల్ కేసులో ఒకే నిందితుడు రెండు క్వాష్ పిటిషన్లు వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఖమ్మం జిల్లా కల్లూరు పీఎస్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ రాయల నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జె. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఇదే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని నాగేశ్వరరావు గతంలోనే మరో పిటిషన్ వేసి ఉండడం విచారణలో బయటపడింది.
మరో నిందితుడితో కలిసి గతంలో పిటిషన్ వేసిన విషయం పిటిషనర్ తమకు చెప్పలేదని ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. కోర్టు అందుకు అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
