జర కంట్రోల్ సారూ .. సెక్యూరిటీ పోలీస్ను చెంప దెబ్బ కొట్టిన హోంమంత్రి

జర కంట్రోల్ సారూ .. సెక్యూరిటీ పోలీస్ను చెంప దెబ్బ కొట్టిన హోంమంత్రి

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కంట్రోల్ తప్పారు.. ప్రస్టేషన్ అయ్యారు.. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు.. దీంతో సెక్యూరిటీ పోలీస్ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన హైదరాబాద్ లోనే జరిగింది. 2023, అక్టోబర్ 6వ తేదీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పటానికి మంత్రి తలసాని దగ్గరకు వెళ్లారు హోం మంత్రి మహమూద్ అలీ. 

ఈ సందర్భంగా మంత్రి తలసానిని ఆలింగనం చేసుకుని అభినందనలు చెప్పారు. ఆ తర్వాత పూల బొకే ఇచ్చేందుకు పక్కన సెక్యూరిటీ పోలీస్ ను అడిగారు. ఆ బొకే ఆ పోలీస్ చేతిలో లేదు.. దీంతో ప్రస్టేషన్ ఫీలయిన హోంమంత్రి అలీ.. ఆ సెక్యూరిటీ పోలీస్ చెంపపై కొట్టారు. బొకే ఏదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే పక్కనే ఉన్న ఆయన సిబ్బంది బొకే ఇవ్వటం.. దాన్ని మంత్రి తలసానికి ఇవ్వటం జరిగిపోయింది. 

హోం మంత్రి మహమూద్ అలీ.. సెక్యూరిటీ పోలీస్ చెంపపై కొట్టేది.. అక్కడే ఉన్న మీడియా కెమెరాలకు చిక్కింది. చెంప దెబ్బ తిన్న పోలీస్ సైతం.. కొన్ని సెకన్లు షాక్ అవుతారు..హోంమంత్రి ప్రవర్తనతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉండటం.. విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. 

ALSO READ :  బంజారాహిల్స్ పీఎస్, సీఐ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఏదిఏమైనా హోం మంత్రి మహమూద్ అలీ.. అలా చేయకుండా ఉండాల్సింది అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. పూల బొకే.. ఓ 10 సెకన్లు లేటు అయితే ఏం కాదు కదా.. ఇంత చిన్న విషయానికే సెక్యూరిటీ పోలీస్ చెంప చెల్లుమనిపించటం బాగోలేదంటున్నారు నెటిజన్లు. హోం మంత్రి మహమూద్ అలీ చర్యను పక్కనే ఉండి చూసిన మంత్రి తలసాని సైతం.. ఆ ఘటన తర్వాత హోం మంత్రి మహమూద్ అలీ చేతులు పట్టుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది.