బంజారాహిల్స్ పీఎస్, సీఐ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

బంజారాహిల్స్ పీఎస్, సీఐ నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ బంజారాహిల్స్ సీఐ నరేందర్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కొంత కాలంగా ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు నరేందర్ ఇంట్లో  సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పీఎస్ లోనే ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. 

ALSO READ : ఎమ్మెల్యే షకీల్కు నిరసన సెగ.. కాన్వాయ్ని అడ్డుకున్న గ్రామస్తులు

సీఐ నరేందర్ పై కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఆయన బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయనపై ఏసీబీ నిఘా పెట్టింది. ఓ కేసు విషయంలో మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు బంజారాహిల్స్ సీఐ నరేందర్. ఆ బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. మూడు లక్షల రూపాయలను సీఐకి అందజేశారు. ఆ తర్వాత ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. 

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సీఐ నరేందర్ ఛాంబర్ తోపాటు.. నరేందర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. సీఐ నరేందర్ డీల్ చేసిన కేసులకు సంబంధించి కూడా వివరాలు రాబడుతున్నారు. ఏసీబీకి చెందిన రెండు బృందాలు.. ఒకే సారి బంజారాహిల్స్ సీఐ నరేంద్ర ఇంట్లోతోపాటు.. పోలీస్ స్టేషన్ లోని అతని ఛాంబర్ లో తనిఖీలు చేయటం విశేషం.