మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి కలెక్టర్ సత్యశారద, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మహిళలకు కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు. పలుచోట్ల మహిళా టీచర్లకు గేమ్స్ నిర్వహించారు.
ములుగు జిల్లా కేంద్రంతోపాటు తాడ్వాయి, వెంకటాపూర్ మండల కేంద్రాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బందిని సన్మానించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్అంకిత్ మహిళా ఉద్యోగులను సత్కరించారు. పాల్వంచ పట్టణం, మండలల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు అవార్డులుఅందజేశారు.-వెలుగు, నెట్వర్క్
