సమస్యలు పరిష్కారించాలని మంత్రికి వినతి

సమస్యలు పరిష్కారించాలని మంత్రికి వినతి

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఒకటో వార్డు డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల సముదాయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి వివేక్​ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో  కాంగ్రెస్ లీడర్​ గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో లబ్దిదారులు మంత్రిని కలిశారు. 200 మంది లబ్దిదారులకు డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లను కేటాయించి నాలుగు నెలలు గడిచినా మౌలిక వసతులు కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

డ్రింకింగ్​వాటర్​ సప్లై లేదని, ఇంటర్నల్​రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. వాటర్​ సప్లైకి అవసరమైన నాలుగు కమర్షియల్​విద్యుత్​ మీటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో దండు సదానందం, రహమాత్ పాషా, తుంగపిండి ప్రసాద్, బంగారి సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.