ముల్కనూర్ డెయిరీ నుంచి బిస్కెట్స్, రస్క్ 

ముల్కనూర్ డెయిరీ నుంచి బిస్కెట్స్, రస్క్ 

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా సహకార డెయిరీ (స్వకృషి) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా బిస్కెట్, రస్క్ బిస్కెట్‌‌లను శనివారం సంఘ కార్యాలయంలో విడుదల చేశారు. మహిళా సాధికారత స్ఫూర్తితో ఈ ప్రీమియం ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ తెలిపారు.

సంప్రదాయ వంటకాల పద్ధతులు, ఉత్తమమైన స్థానిక పదార్థాలతో తయారుచేసిన ఈ తెలంగాణ ప్రత్యేక రుచులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. అనంతరం జీఎం మార్పటి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డెయిరీ, ఆహార రంగంలో ముందుకు సాగుతున్న మహిళలకు గౌరవంగా ఈ ఉత్పత్తులను విడుదల చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు 122 గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.