మెడికల్ రిప్రజెంటేటివ్స్ ‘సామాజిక శోధకులు’

మెడికల్ రిప్రజెంటేటివ్స్ ‘సామాజిక శోధకులు’

మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు : తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మెడికల్ రిప్​లను ‘సామాజిక శోధకులు’గా అభివర్ణించారు. శనివారం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.

 మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని, మందులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసి రిప్​లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఫార్మా యాజమాన్యాలు కేవలం లాభాపేక్షత కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, పరిశ్రమల వల్ల కలిగే కాలుష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటోందని హెచ్చరించారు.