టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్

టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్

2022 – 23 సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఓ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే అర్హత పరీక్ష ఐసెట్ నోటిఫికేషన్ రిలీజైంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450, ఇతరులకు రూ.650 ఫీజుగా నిర్ణయించారు. రూ.250 లేట్ ఫీజుతో జులై 11 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జులై 18 వరకు, రూ.వెయ్యి లేట్ ఫీజుతో జులై 23 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జులై 27, 28 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 4న ప్రిలిమినరీ కీ, 22న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు