
- జనవరి లాస్ట్ వీక్ నుంచే ప్రాక్టికల్స్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ప్రారంభించింది. కాగా, త్వరలోనే పరీక్షల పూర్తి షెడ్యూల్ను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతాయి.
మార్చి12లోగా ఈ పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే, గతేడాది పలు కాలేజీలకు గుర్తింపు ఆలస్యం కావడంతో పరీక్షలను మార్చి ఫస్ట్ వీక్లో ప్రారంభించారు. దీనివల్ల జేఈఈ, ఇతర ప్రవేశపరీక్షలు రాసే విద్యార్థులకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇంటర్ బోర్డు అధికారులు ఫిబ్రవరిలో పరీక్షలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. మరోపక్క జనవరి లాస్ట్ వీక్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.