హెల్త్ ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌కు కేరాఫ్ తెలంగాణ.. మెడిసిన్‌‌‌‌‌‌‌‌కు టెక్నాలజీ తోడైతేనే ప్రజలకు అత్యుత్తమ వైద్యం

హెల్త్ ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌కు కేరాఫ్ తెలంగాణ.. మెడిసిన్‌‌‌‌‌‌‌‌కు టెక్నాలజీ తోడైతేనే ప్రజలకు అత్యుత్తమ వైద్యం
  • ‘హోమా సీఎంఈ 2026’ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
  • ‘ది న్యూ పారాడైమ్’ బుక్, ‘మెట్రిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోరర్’ యాప్ ఆవిష్కరణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల నైపుణ్యాలను హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ విభాగంతో సమర్థవంతంగా అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో సమగ్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. టీ-హబ్ వేదికగా ‘బియాండ్ నంబర్స్–ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటిస్ అండ్ మెటబాలిక్ కేర్’ అంశంపై నిర్వహించిన ‘హోమా సీఎంఈ 2026’ జాతీయ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలందించేకు  మెడిసిన్‌‌‌‌‌‌‌‌ను సరికొత్త టెక్నాలజీతో మిళితం చేస్తున్నట్లు వివరించారు. ‘నేడు డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటిని పాతకాలపు సంప్రదాయ వైద్య విధానాలతోనే కాకుండా, రోగుల లైఫ్ స్టైల్ డేటాను సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా కట్టడి చేయవచ్చు. భవిష్యత్తులో హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ రంగంలో ఎదురయ్యే సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేందుకు ముందుకు వచ్చే వినూత్న ఆలోచనలకు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

అనంతరం డాక్టర్ ముద్దు సురేంద్ర నెహ్రూ రచించిన ‘ది న్యూ పారాడైమ్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రపంచంలోనే మొదటి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోరర్’ను ప్రారంభించారు. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీవోసీ)’ కింద ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఎంపిక చేసిన 50 మంది రోగులకు ఉచిత ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ను అందించే వినూత్న కార్యక్రమాన్ని షురూ చేశారు.