అక్టోబర్ 9న చకోర రిలీజ్‌‌‌‌కు రెడీ

 అక్టోబర్ 9న చకోర రిలీజ్‌‌‌‌కు రెడీ

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం  ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ దగ్గర  ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  డా. చింతాడ హేమారావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది.  ఇక శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు  అక్టోబర్ 9న ఈ సినిమాను వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. 

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు మాట్లాడుతూ.. వేరే వాళ్ళు హక్కులకోసం పోటీపడుతున్నా తమకు ప్రాధాన్యత ఇచ్చి థియేట్రికల్ హక్కులు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ డాక్టర్ చింతాడ హేమారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. థియేట్రికల్ రైట్స్ ద్వారానే తమ సినిమాకు టేబుల్ ప్రాఫిట్ లభించినందుకు గర్వపడుతున్నామని నిర్మాత  డాక్టర్. చింతాడ హేమారావు  ఆనందాన్ని వ్యక్తపరిచారు.