‘ఆర్‌ఎక్స్ 100’తో హీరోగా మెప్పించిన కార్తికేయ.. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో విలన్‌గానూ మెప్పించాడు. అయితే గత రెండేళ్లుగా తన నుంచి సినిమా రాలేదు. కెరీర్‌లో చిన్న విరామం తీర్వాత ఇప్పడు కమ్ బ్యాక్‌కు రెడీ అయ్యాడు. సోమవారం తన బర్త్ డే. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు.
‘కమ్ బ్యాక్’ పేరుతో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంతో కార్తికేయ దర్శకుడిగానూ పరిచయం అవుతుండటం విశేషం. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై కార్తికేయ భార్య లోహితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. ‘‘బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్ళు అవుతోంది. నేనింకా ప్రొఫెషన్ మారిపోయి ఉంటాడేమో అనుకున్నాను. మూడేళ్ళు అవుతోందని నీకు గుర్తు అన్నా ఉంది.
అది నాకు కూడా లేదు. అయినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు.. ఓ విధంగా ఇది ఆత్మహత్య చేసుకోవడమే..’’ అనే మాటల మధ్య కార్తికేయ పాత్రను పరిచయం చేసిన తీరు సినిమాపై ఆసక్తిని రేపింది. కమ్ బ్యాక్ ఇవ్వబోతున్న బాక్సర్ పాత్రలో స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తూ పాత్రకు తగ్గట్టుగా ఫిట్‌గా కనిపించాడు కార్తికేయ. విజయ్ బుల్గానిన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
