సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్ హీరో హీరోయిన్లుగా పరమేష్ రేణుకుంట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’. దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి నిర్మించారు. అక్టోబర్ చివరి వారంలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సోమవారం ‘అప్పుడే పెళ్లా’ అనే పాటను నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేసి.. కంటెంట్‌తో పాటు ఎమోషన్ ఉన్న సినిమా ఇదని, ఇందులో యూత్‌కు మంచి సందేశం కూడా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు పరమేష్ మాట్లాడుతూ ‘జెన్ జీ బ్యాచ్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. వాళ్లకు తమను తాము స్క్రీన్ మీద చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటికే సినిమా చూసిన కొంతమంది యూత్‌కు క్రేజీగా నచ్చుతుంది’ అని చెప్పాడు.
యూత్ అంతా రిలేట్ చేసుసుకునేలా సినిమా ఉంటుందని నటీనటులు అన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి, రచయిత ఘటిక చలం, ఎడిటర్ ఆవుల వెంకటేష్ పాల్గొన్నారు.
