జర్నలిస్ట్ ల రక్షణ చట్టం తీసుకురావాలి : టీడబ్ల్యూజేఎఫ్

జర్నలిస్ట్ ల రక్షణ చట్టం తీసుకురావాలి : టీడబ్ల్యూజేఎఫ్
  •     ఆరు ప్రధాన డిమాండ్లతో జంతర్ మంతర్ లో తెలంగాణ జర్నలిస్టుల ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్‌‌మంతర్‌‌లో ‘చలో పార్లమెంట్’ పేరుతో ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొని మద్దతు తెలిపారు. 

ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్‌‌ల పునరుద్ధరణ, రక్షణ చట్టం అమలు, సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పింఛన్ పథకం, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, వేజ్‌‌బోర్డు అమలు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు పునఃసమీక్ష తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.