నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ‘డీట్‘యాప్

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ‘డీట్‘యాప్

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు ఉపాధి, కంపెనీల అవసరాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్​ఎంప్లాయిమెంట్​ఎక్సేంజ్​ఆఫ్​తెలంగాణ(డీట్) యాప్​ను తీసుకొచ్చిందని కార్మిక మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సోమవారం మంత్రి ఈ యాప్​ను ఆవిష్కరించి మాట్లాడారు. నిరుద్యోగులు, ఉద్యోగ ఆశావహులు ఈయాప్​డౌన్​లోడ్​చేసుకుని, తమ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఈ వివరాలను, కంపెనీల అవసరాలను పరిశీలించి.. అవసరమైన కంపెనీలకు అర్హులైన అభ్యర్థుల వివరాలను పంపిస్తుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ యాప్​లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 45 వేల ఖాళీల వివరాలు ఉన్నాయన్నారు. టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రం ముందుందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. సోమవారం ప్రారంభమైన వన్ ప్లస్ ఆర్డీ సెంటర్ లో 1500 మందికి ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ యజమాన్యం చెప్పిందన్నారు. త్వరలో ఇజ్రాయెల్ కంపెనీ రాష్ట్రానికి రాబోతోందని చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తిచూపుతున్నారని, ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోందన్నారు. డీట్ యాప్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని జయేశ్​రంజన్​చెప్పారు.