
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. ఈ గెలుపోటముల గురించి కాసేపు పక్కనపెడితే.. ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ చూపిన పోరాట పటిమ మాత్రం స్టేడియంలో చప్పట్ల మోత మోగించింది. క్రిస్ వోక్స్ ఉన్న పరిస్థితికి క్రీజులోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ.. వచ్చాడు. నిలిచాడు. ఎడమ భుజానికి గాయమైనా పట్టీ వేసుకుని వచ్చి తన తోటి బ్యాటర్లో ఆత్మ విశ్వాసం నింపాడు. రైట్ హ్యాండ్తో మాత్రమే బ్యాటింగ్ ఆడే పరిస్థితి క్రిస్ వోక్స్ది. అది కూడా కష్టమే.. కానీ అనివార్యమైన ఆ పరిస్థితుల్లో ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రీజులోకి వచ్చాడు. క్రిస్ వోక్స్ చూపిన ధైర్యానికి స్టేడియంలోని టీమిండియా అభిమానులు కూడా లేచి మరీ చప్పట్లు కొట్టారు.
క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని ఒక భావోద్వేగమని.. ఈ దృశ్యం మరోసారి కళ్లకు కట్టింది. గ్రౌండ్లోకి వెళుతున్న క్రిస్ వోక్స్కు ఓవల్ క్రౌడ్ సలాం చేసింది. క్రిస్ వోక్స్ పరిస్థితి తెలిసిన తన తోటి బ్యాట్స్మెన్ అతనిని ఏమాత్రం కష్టపెట్టలేదు. క్రిస్ వోక్స్ ఒక్క బంతి కూడా ఎదుర్కొనే పరిస్థితి రాకుండా తానే బ్యాటింగ్ చేశాడు. అట్కిన్ సన్ ఒక సిక్స్ కొట్టి 17 పరుగులు చేసినప్పటికీ సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సిరీస్తో 2-2తో సమం చేసింది. ఐదు టెస్ట్ల సిరీస్లో ఒక మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
ALSO READ | IND vs ENG 2025: లెక్క సరిచేసిన సిరాజ్.. నిన్న తిట్టినవాళ్ళే ఇవాళ హీరో అంటున్నారు..
చేజారిందనుకున్న మ్యాచ్‌లో ఆశలు సజీవంగా నిలిపిన ఇండియా పేసర్లు జట్టును విజయతీరాలకు చేర్చారు. సిరాజ్ 5 వికెట్లు తీసి అదరగొట్టడంతో బ్రూక్ క్యాచ్ విషయంలో వచ్చిన విమర్శలన్నీ పటాపంచలైపోయాయి. ప్రసిద్ధ్ వేసిన 35వ ఓవర్లో హ్యారీ బ్రూక్ పుల్ షాట్‌కు ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన బాల్‌ను సిరాజ్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ పట్టినప్పటికీ, బౌండరీ లైన్‌పై అడుగు వేయడంతో అది సిక్స్‌గా మారింది.
అప్పటికి 19 రన్స్ వద్ద ఉన్న బ్రూక్ ఈ లైఫ్‌తో మరింత రెచ్చిపోయి ఆడి సెంచరీ కొట్టాడు. చివరకు ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో అతను సిరాజ్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ, ఈ మధ్యలో కీలకమైన 92 రన్స్ రాబట్టాడు. దీంతో.. సిరాజ్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ విమర్శలపై తన బౌలింగ్ తోనే సిరాజ్ ధీటైన సమాధానమిచ్చాడు. 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది.
Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE
— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025