లాసెట్ లో 66.46% మంది క్వాలిఫై .. రిజల్ట్స్ రిలీజ్ చేసిన బాలకిష్టారెడ్డి

లాసెట్ లో 66.46% మంది క్వాలిఫై .. రిజల్ట్స్ రిలీజ్ చేసిన బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఎల్‌‌‌‌‌‌‌‌సెట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. లాసెట్​లో 66.46% మంది క్వాలిఫై అయ్యారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ  ఎం. కుమార్ లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం 57,715 మంది అప్లై చేసుకోగా, 45,609 మంది ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు. వీరిలో 30,311 మంది అర్హత సాధించారు. మూడేండ్ల ఎల్ ఎల్ బీ కోర్సులో 32,118 మంది ఎగ్జామ్ రాయగా,  21,715 మంది క్వాలిఫై అయ్యారు. ఐదేండ్ల ఎల్​ఎల్​బీకి 9,325 మంది హాజరైతే, 4,833 మంది అర్హత సాధించారు. 

రెండేండ్ల ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఎం కోర్సుకు 4,166 మంది హాజరైతే, 3,763 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ https://lawcet.tgche.ac.in  నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో 33,814 మంది పరీక్ష రాయగా..22,365 మంది, తెలుగులో 11,671 మంది రాయగా7,916 మంది, ఉర్దూ మీడియంలో 124 మంది రాయగా 30 మంది క్వాలిఫై అయ్యారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.