గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే ఏజెన్సీలు రద్దు : మంత్రి ఉత్తమ్ 

గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే ఏజెన్సీలు రద్దు : మంత్రి ఉత్తమ్ 
  • నేడు గ్యాస్​కంపెనీల ప్రతినిధులతో సమావేశం: మంత్రి ఉత్తమ్ 

సూర్యాపేట, వెలుగు: ఎల్​పీజీ కృత్రిమ కొరత సృష్టించి, వసూళ్లకు పాల్పడితే గ్యాస్ ​ఏజెన్సీలను రద్దు చేస్తామని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్​పీజీ కొరత తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

డిమాండ్, సప్లై వివరాలను పరిశీలించి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు ఆందోళనకు గురికావొద్దని సూచించారు.