పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాలి : ముదిరాజ్పోరాట సమితి

పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాలి : ముదిరాజ్పోరాట సమితి
  • తెలంగాణ ముదిరాజ్​పోరాట సమితి పిలుపు 

హైదరాబాద్​సిటీ, వెలుగు : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలు ఎక్కడ పోటీ చేసినా.. అన్ని కుల సంఘాలు కలిసి బీసీలను గెలిపించుకోవాలని తెలంగాణ ముదిరాజ్​పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకరబోయిన మహేశ్​పిలుపునిచ్చారు. అలాగే.. ముదిరాజ్​లు అత్యధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలన్నారు. గురువారం సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో మీడియా సమావేశం ఏర్పాటు  చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్​లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గర ప్రతి ముదిరాజ్ సపోర్టు చేసి అన్ని కులాల సపోర్ట్ తీసుకొని గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. కార్యక్రమంలో నీలం మధు, ప్రధాన కార్యదర్శి ఉప్పరవేణి రంజిత్,  రాష్ట్ర కార్యదర్శులు తలారి రవి, వీరేష్, నాయకులు బొగురు మల్లేశ్, గణేశ్​మహేశ్​పాల్గొన్నారు.