తెలంగాణ డీజీపీపై BRS వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యఖ్యాలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం మండిపడింది. కేటీఆర్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
కేటీఆర్ వ్యాఖ్యల ఖండిస్తూ 2025 నవంబర్ 12వ తేదీన పోలీసు అధికారుల సంఘం పత్రికా ప్రకటన విడుదల చేసింది. డీజీపీ నాయకత్వంలో తెలంగాణ పోలీస్ అప్రమత్తంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది. పోలీసు శాఖ చట్టానికి, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పింది.
దోపిడీ, హత్య కేసుల్లో పోలీసులు వేగంగా నిందితులను పట్టుకున్నారని సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. పోలీసుల పనితీరులో తప్పు లేదని, సంస్కారయుతంగా మాట్లాడాలని సూచించారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తి చేస్తూ సంఘం అధ్యక్షుడు వై. గోపిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
