V6 News

సైబర్​ నేరాలు అరికట్టడానికి... ఐదు పాయింట్ల ఫార్ములా

సైబర్​ నేరాలు అరికట్టడానికి... ఐదు పాయింట్ల ఫార్ములా

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు ఏకంగా పోలీస్​ డిపార్ట్​మెంట్​ఫేస్​బుక్​ పేజీనే హ్యాక్​ చేసి అందులో బూతు వీడియోలు అప్​లోడ్​ చేయడం సంచలనం సృష్టించింది. సామాన్యులు సైబర్​ నేరాల బారిన పడటం సాధారణమైపోయింది. వీటి నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. అనుకున్న మేర సక్సెస్​ కాలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సైబర్​ సెక్యూరిటీ బ్యూరో సైబర్​ మోసాలు నిరోధించడం, వారి ఉచ్చులో పడకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఐదు పాయింట్ల ఫార్ములాను విడుదల చేసింది.  

పాస్​వర్డ్​లు..

సోషల్​ మీడియా, ఆన్​లైన్​బ్యాంకింగ్​, ఈ మెయిల్​ తదితర ప్లాట్​ఫాంలకు దేనికదే ప్రత్యేకమైన పాస్ వర్డ్​లు ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. చాలా వాటిల్లో ఒకే పాస్​వర్డ్​ ఉపయోగించడం వల్ల మోసానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుందని వారు వెల్లడించారు. వ్యక్తుల పేర్లు, పుట్టిన తేదీలు తదితర వ్యక్తిగత సమాచారం బేస్​ చేసుకుని పెట్టే పాస్​వర్డ్​లను యూస్​ చేయవద్దని, పెట్టిన పాస్​వర్డ్​లను ఎవరితో షేర్​ చేయవద్దని సూచిస్తున్నారు.

విశ్వసనీయతే ప్రాధాన్యం..

ఇంటర్నెట్​లో సర్చ్​ చేస్తున్నప్పుడు సైట్​కి సంబంధించిన పాప్ అప్స్​ లాంటివి వస్తే వాటిని యాక్సెప్ట్​ చేసే విషయం దాని విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది.  ఏదైనా యాప్ లు డౌన్​లోడ్​ చేసేముందు వాటికి రేటింగ్​లు, వినియోగదారులు ఇచ్చిన రివ్యూలు అన్ని చెక్​ చేయాలి.

అప్‌డేట్‌గా ఉంచాలి..

ల్యాప్​టాప్​లు, ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్ల సాఫ్ట్​వేర్​లను నిత్యం అప్​టు డేట్​ గా ఉంచాలి.  

యాంటీ వైరస్​

డిజిటల్​ భద్రత మెరుగుపరచడానికి నమ్మకమైన యాంటీవైరస్​ సాఫ్ట్​వేర్​ను ఉపయోగించడం మేలు.

లింక్​లు క్లిక్​ చేయవద్దు..

వాట్సప్​, ఈ మెయిల్​, మెసేజ్​ల ద్వారా అన్నౌన్​ నంబర్ నుంచి మెసేజ్​లు వస్తే వాటిని క్లిక్​ చేయకపోవడమే మంచిది. ఈ లింకులు, యూఆర్​ఎల్​లను సైబర్​ నేరగాళ్లు ప్రజల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తారు. వీటన్నింటినీ ఫాలో కావడం ద్వారా సైబర్​నేరాలను గణనీయంగా తగ్గించవచ్చు.