'దిల్ బర్', 'సాకి సాకి' వంటి బ్లాక్ బస్టర్ ఐటెం సాంగ్స్ తో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది డ్యాన్స్ బ్యూటీ నోరా ఫతేహి. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ వేదికలపై కూడా తన అద్భుతమైన డాన్స్ స్టెప్స్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించేస్తూ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే 'మోస్ట్ గూగుల్డ్ బాలీవుడ్ ఆర్టిస్ట్' (Most Googled Bollywood Artist) గా నిలిచింది.
గూగుల్ ట్రెండ్స్‌లో నోరా ఫతేహి..
ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, అలియా భట్ వంటి టాప్ హీరోయిన్లను వెనక్కి నెట్టి నోరా ఈ మైలురాయిని అందుకుంది.. ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) ఓపెనింగ్ సెర్మనీలో ఆమె ఇచ్చిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ తర్వాత గూగుల్ ట్రెండ్స్‌లో ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్ లోకి ఉంది.
కెనడా వేదికగా హిస్టారికల్ పెర్ఫార్మెన్స్
కెనడాలోని టొరంటోలో గల బిఎమ్‌ఓ ఫీల్డ్ (BMO Field) లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల్లో నోరా ఫతేహి తన ఎలక్ట్రిఫైయింగ్ డాన్స్‌తో స్టేజ్‌పై నిప్పులు చెరిగింది. భారతీయ, మొరాకో మూలాలున్న ఈ నటిని అంతర్జాతీయ వేదికపై చూడటం భారతీయులకు, ముఖ్యంగా ఇక్కడి ఫుట్‌బాల్ అభిమానులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఆమె పెర్ఫార్మెన్స్ వీడియో యూట్యూబ్‌లోకి వచ్చిన కేవలం 24 గంటల్లోనే దాదాపు 20 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. గతంలో 2022 ఫిఫా వరల్డ్ కప్‌లోనూ నోరా సందడి చేసింది. అయితే ఈసారి ఆమె క్రేజ్ అంతకుమించి సరికొత్త రికార్డులను సృష్టించింది.
భావోద్వేగానికి గురైన నోరా..
ఈ చారిత్రాత్మక విజయం తర్వాత నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటూ కొన్ని ఎమోషనల్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె తల్లి, సోదరుడు, సోదరితో పాటు ఆమె స్కూల్ టీచర్ కూడా ఉన్నారు. నా కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు దాటాను. కానీ, నా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అందరూ కలిసి నా విజయాన్ని ఇలా ఒకే చోట సెలబ్రేట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ క్షణాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను అంటూ నోరా క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. తన మొరాకో-ఇండియన్ మూలాలను గౌరవిస్తూ, తనకు నిరంతరం మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బాలీవుడ్ నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన నోరాకు ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.
