పాస్‌‌‌‌పోర్ట్ వెరిఫికేషన్‌‌‌‌ లో  మన పోలీసులకు జాతీయ అవార్డ్‌‌‌‌

పాస్‌‌‌‌పోర్ట్ వెరిఫికేషన్‌‌‌‌ లో  మన పోలీసులకు జాతీయ అవార్డ్‌‌‌‌
  • ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్‌‌‌‌కు ఎంపిక చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: పాస్‌‌‌‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీస్ వెరిఫికేషన్‌‌‌‌ ప్రక్రియలో రాష్ట్ర పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2025-–26  సంవత్సరంలో పాస్‌‌‌‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్‌‌‌‌లో విశిష్ట సేవలు అందించినందుకుగాను కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అవార్డును ప్రకటించింది. ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, చీఫ్ పాస్‌‌‌‌పోర్ట్ ఆఫీసర్ బీఎస్ ముబారక్, డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌కు అధికారిక లేఖ పంపారు.

కాగా, ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహించే పాస్ పోర్ట్ సేవ  సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ నెల19న న్యూఢిల్లీలోని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ భవన్‌‌‌‌లో జరుగనున్న పాస్‌‌‌‌పోర్ట్ సేవా దివస్, పాస్‌‌‌‌పోర్ట్ అధికారుల సదస్సులో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ అవార్డును అందుకోనున్నారు.