- కోల్‌కతాలో పురస్కారం అందుకున్న బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు ‘ఆధార్ సంవాద్-2026’ జాతీయ అవార్డు దక్కింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా సమర్థవంతంగా తనిఖీలు చేపట్టినందుకుగాను కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని ఎంపిక చేసింది. ఈ మేరకు కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన 5వ జాతీయ సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ చేతుల మీదుగా బోర్డ్ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
