సూర్యాపేట డీఈవో ట్రాన్స్ ఫర్..  స్కూల్ యాజమాన్యాల సంబురాలు

సూర్యాపేట డీఈవో ట్రాన్స్ ఫర్..  స్కూల్ యాజమాన్యాల సంబురాలు

     డీఈవో అశోక్‌‌‌‌ను హైదరాబాద్ కు బదిలీ చేసిన ప్రభుత్వం

వెలుగు : సూర్యాపేట డీఈవో ట్రాన్స్ ఫర్ కావడంతో విద్యార్థి సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నాడు. సూర్యాపేట డీఈవోగా అశోక్ సుమారు ఆరేండ్ల పాటు పనిచేశారు. ఈ కాలంలో రూల్స్ పాటించకుండా నిధుల గోల్‌‌‌‌మాల్‌‌‌‌కు పాల్పడ్డారని, ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు, రెన్యూవల్స్ తో పాటు తనిఖీల పేరిట లక్షల్లో వసూళ్లు చేశారని ఆరోపణలు వినిపించాయి.

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను నిత్యం వేధింపులకు గురి చేసేవారని, సర్కార్ స్కూళ్లలో సమస్యలను పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయంగా పనిచేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. డీఈవో అవినీతిపై గతంలో ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా రాజకీయ అండదండలతో ట్రాన్స్ ఫర్ కాకుండా కాపాడుకున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాల నేతలు, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. విద్యాశాఖను తన అడ్డాగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారి పోయారంటూ ఆనందం వ్యక్తం చేశారు.