- విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: ఇటీవల నిర్వహించిన 27వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీస్ బిగిల్ బృందం రజత పతకం సాధించింది. ఈ మేరకు విజేతలను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ ప్రతిభను చాటడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ పోలీస్ బిగిల్, బ్యాండ్ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
నవంబర్ 16 నుంచి 20 వరకు హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర పోలీస్ బలగాలు బ్యాండ్, బిగిల్ బృందాలు పాల్గొన్నాయి. రజత పతకం సాధించిన బృందంలో వారిలో హెడ్‌కానిస్టేబుళ్లు ఎస్.సంతోష్ (హెచ్‌సీ 1967), కె.స్వామి (హెచ్‌సీ 2562), ఎస్. వెంకటయ్య (హెచ్‌సీ 873), జి. వెంకటస్వామి (హెచ్‌సీ 1427), ఏవీఎస్ భావన రుషి (హెచ్‌సీ 197), కానిస్టేబుళ్లు కె.రామ్‌లాల్ (పీసీ 3361), ఎస్.ప్రవీణ్ కుమార్ (పీసీ 10250) సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ పోలీస్ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ సంస్థలు, హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పని చేస్తున్నారు.
