వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి

వికారాబాద్ లో  ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్​లోనే చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో  వికారాబాద్ మండలంలోని పెండ్లిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పాము కాటుకు గురైన మాల పార్వతమ్మకు ఆయుర్వేద మందు కోసం ధారూరు మండలంలోని కెరెల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుగ్గ రామలింగేశ్వరాలయం సమీపంలోని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరకు రాగానే ఎదురుగా సెడెం నుంచి నవాబుపేటకు వెళ్తున్న లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను హరిజన్​నగేశ్ (30), హరిజన్​సరిత (30), హరిజన్​ చంద్రమ్మ (60), మాల పార్వతమ్మ (50) పోలీసులు గుర్తించారు. వికారాబాద్​ జిల్లా పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి,  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ తీవ్ర దిగ్ర్భాంతి 

వికారాబాద్​లోని బుగ్గ రామేశ్వరం ఆలయం సమీపంలో జరిగిన ప్రమాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

స్పీకర్  ఆదేశాలకు మేరకు శివారెడ్డి పేట పీఎసీఎస్​ చైర్మన్ బిళ్లపాటి రాజశేఖర్ రెడ్డి, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం తక్షణ సహాయం కింద మృతుల కుటుంబాలకు రూ.30 వేలు అందజేశారు.